ప్రజావాణికి ఆలస్యంగా అధికారులు

అయిజలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు సమయానికి హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి కొందరు అధికారులు ఆలస్యంగా రావడంతో తమ సమస్యలు తెలియజేయడానికి వచ్చిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు సమయపాలన పాటించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕