జోగులాంబ గద్వాల జిల్లాలో పందుల దొంగతనాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో గ్రామాల నుండి పందులను ఎత్తుకెళ్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సీసాలు, రాళ్లతో దాడి చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో భయం నెలకొంది. దొంగతనాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.