గద్వాల్: మాజీ జడ్పీ చైర్మన్ సరిత కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల్లో బి-ఫామ్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, తాము రాజకీయ వ్యభిచారం చేయడం లేదని జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సరిత బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాలలో కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీ జెండా మోసిన తనకు, డీసీసీనే మోసం చేసిందని, ఈ విషయంపై టీపీసీసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదని గుంటనక్కలకు సీట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. అధిష్టానం తన వైపే ఉందని, ప్రజలకు మరింత దగ్గరై తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్