పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థి ఉమ సంజీవ్ ముదిరాజును గెలిపించాలని ఆమె కోరారు. గ్రామీణాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆమె వివరించారు.