గద్వాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డా. ఆంజనేయులు గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ తో కలిసి గద్వాల టౌన్ మున్సిపల్ అభ్యర్థుల మొదటి జాబితాను (17 వార్డులు) అధికారికంగా ప్రకటించారు. గద్వాలలో కాంగ్రెస్, బీజేపీలు పైకి వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా, విచిత్రమైన రాజకీయం నడుస్తోందని నాయకులు విమర్శించారు.