లోయర్ జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా కృష్ణా నదిలో ప్రయాణాలపై ఆదివారం ఆంక్షలు విధించారు. ఆత్మకూరు మండలం జూరాల గ్రామం నుంచి గద్వాల జిల్లా కొత్తపల్లి వరకు నది గుండా సాగే రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆత్మకూరు SI జయన్న తెలిపారు. ప్రజలు నది వైపు వెళ్లవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ఆయన సూచించారు.