అక్రమంగా పశువులు తరలిస్తున్న 8 బొలెరో వాహనాలు పట్టివేత ?

జడ్చర్ల నియోజవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి ఎనిమిది బొలెరో వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా, పశువులతో వెళ్తున్న ఎనిమిది బొలెరో వాహనాలు పట్టుబడినట్లు తెలిసింది. వాహనాల్లో ఉన్న పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఈ ఘటనకు సంబంధించి వాహనాలను మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, పశువుల తరలింపునకు సంబంధించిన అనుమతులు, పత్రాలను పరిశీలిస్తున్నట్లు పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕