మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిధిలోని చిల్వేర్ గ్రామంలో 26వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.