ఊర్కొండపేటలో బిఆర్ఎస్ నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండపేటలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ వేధింపుల్లో భాగమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్