మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ పేటలో ఉన్న శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. జూలై 4న మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి మిడ్జిల్ ZPTC గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో వస్తుండటంతో స్థానిక ప్రజలు, నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంత నాయకుడు రాష్ట్ర సీఎంగా ఎదగడం గర్వకారణమని, ఆయన రాకతో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.