సీఎం రేవంత్ రెడ్డి ఊర్కొండపేట రాక: అభివృద్ధిపై ఆశలు

జూలై 4న మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఊర్కొండపేటకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారు. ఆయన ప్రసిద్ధి గాంచిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. తమ రాజకీయ పునాది అయిన ఈ ప్రాంతానికి సీఎం రావడం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంత నాయకుడు రాష్ట్ర సీఎంగా ఎదగడం ఈ గడ్డకు వరమని కొనియాడుతూ, ఆయన రాకతో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్