ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గానికి రానున్నారు. గంగాపూర్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. వేదిక, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి రాకతో నియోజకవర్గ అభివృద్ధికి ఊతమిస్తుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ జానకి కూడా పాల్గొన్నారు.