మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి సోమవారం జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అక్కడున్నవారికి సూచించారు. నాణ్యత లోపించిన భోజనాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండుసార్లు భోజనాన్ని తయారు చేసి తనకు నివేదిక అందించాల్సిందిగా సంబంధిత అధికారులకు చెప్పారు.