ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్ కు ఫిర్యాదు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి శివారులో 102, 105 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వెంచర్ యజమాని ఆక్రమించారని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య శుక్రవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ భూమిని కాపాడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్