మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు నిధులు మంజూరు చేసిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ తెలిపారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ, అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.