జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలో కలెక్టర్ విజయేందిర బోయి గురువారం ఆకస్మికంగా పర్యటించారు. కేజీబీవీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరమ్మ ఇళ్లు, ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు, ఆహార నాణ్యత, విద్యా బోధన, పెండింగ్ పనులపై ఆరా తీసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తూ లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు.