రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాజిపేట మండలం ఎదిరపల్లి గ్రామానికి చెందిన చెన్నమ్మ అనే వృద్ధురాలు గాయపడ్డారు. రాజాపూర్‌లో తన కూతురు వద్దకు వచ్చి తిరిగి వెళుతుండగా, రోడ్డు దాటే సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు.

సంబంధిత పోస్ట్