మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన జెల్ల జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడుగుల మహేష్, మాజీ సర్పంచ్ జెల్ల చెన్నయ్య, నాయకులు కృష్ణ, నాగరాజు, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.