మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల తాహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్.బి.ఐ ఏటీఎం లో గురువారం ఆకస్మికంగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారణ జరుగుతోంది.