జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు బీఆర్కే భవనంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వారు సీఈఓను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.