వనపర్తి పర్యటనకు వెళ్తున్న మాజీమంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం

వనపర్తి పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావుకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై హరీష్ రావును ఆత్మీయంగా ఆహ్వానించారు. పార్టీ జెండాలు, నినాదాలతో పరిసర ప్రాంతం సందడిగా మారింది. నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్