జడ్చర్లలో నకిలీ నోట్ల చలామణి.. నలుగురి అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దొంగ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కిరాణా షాపు యజమాని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 14 రూ. 500 నోట్లు, 13 రూ. 200 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్