ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరుణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణాభివృద్ధి జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.