జడ్చర్లలో వినాయక నిమజ్జనాలు

జడ్చర్ల నియోజకవర్గంలో 9 రోజుల పాటు జరిగిన వినాయక నిమజ్జనాలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిగ్నల్ గడ్డపై ముదిరాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గిరీష్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన కృత్రిమ కొలను వద్ద నిమజ్జనం జరిగింది. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని గణనాధుల విగ్రహాలను నాగసాల చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.

సంబంధిత పోస్ట్

✕
✕