జడ్చర్లలో ఉద్యాన శాఖ అవగాహన సదస్సు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గ స్థాయి సదస్సు జరిగింది. ఛైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో, శాస్త్రవేత్త డాక్టర్ స్వామి శంకర్ ఆధునిక పద్ధతిలో పందిరి సాగు చేయడం ద్వారా తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి సాధించవచ్చని, నాణ్యమైన కూరగాయలు పండించవచ్చని రైతులకు సూచించారు. కూరగాయల సాగు, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్