మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రైతు కావాలి యాదయ్య పొలంలో శనివారం ఏడు బ్రాండెడ్ రేసర్ పాములను స్నేక్ క్యాచర్ డా. సదాశివయ్య, ఆయన శిష్యులు రవీందర్, భరత్ చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పాములు 'కొలుబ్రిడే' కుటుంబానికి చెందిన విషరహితమైనవని, వీటి శాస్త్రీయ నామం అర్జరోజైన్ ఫెసియోలేట అని డా. సదాశివయ్య తెలిపారు. గ్రామస్థులు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని బండ కింద దాగి ఉన్న పాములను పట్టుకున్నారు.