జడ్చర్ల: బైకులు ఢీ.. ఒకరికి గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44పై భవాని మాత ఆలయం వద్ద శుక్రవారం ఉదయం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అండర్ పాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నందున రహదారి ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచనలు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్