మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ఎమ్మెల్యేను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా కలవగా, మంత్రి ఆప్యాయంగా మిఠాయి తినిపించి శుభాకాంక్షలు అందజేశారు.