జడ్చర్ల: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడి అరెస్ట్.!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు నరసింహ యాదవ్ ఢిల్లీలో అరెస్టు కావడంపై యాదవ సంఘం నాయకులు సోమవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏఐ సమ్మేళనంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలిపిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజులు గడుస్తున్నా, కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పార్టీ కోసం పోరాడిన నాయకుడి కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్