మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యదయ్యను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మంగళవారం నాడు యదయ్య నియామక పత్రాన్ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ నియామకంపై కాంగ్రెస్ నాయకులు యదయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.