జడ్చర్ల: రోడ్డుపై పడ్డ కంటైనర్.. భారీగా ట్రాఫిక్ జామ్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రం శివారులోని సూర్య జ్యోతి స్పిన్నింగ్ మిల్ ఎదురుగా జాతీయ రహదారి-44 పై హైదరాబాదు నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఓ కంటైనర్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్ నేతృత్వంలో నాలుగు క్రేన్ల సహాయంతో కంటైనర్ ను తొలగించి, ట్రాఫిక్ ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్