జడ్చర్ల: హైవేపై కంటైనర్ బోల్తా... ఇద్దరికీ తీవ్ర గాయాలు!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తాలో గురువారం ఉదయం జాతీయ రహదారి-44 పై కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మూసాపేట మండలం మాల్దాస్ పల్లి గ్రామానికి చెందిన కాశన్న హైదరాబాద్ వెళుతుండగా, కంటైనర్ ఢీ కొట్టి అదుపుతప్పి కింద పడ్డాడు. కంటైనర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, పోలీసులు అంబులెన్స్‌లో షాద్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది, పోలీసులు క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్