సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మల్లేష్ (32) అనే వ్యక్తి మృతి చెందాడు. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లేష్ ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.