జడ్చర్ల: జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం 44వ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనితో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న పొగమంచు, తీవ్రమైన చలి కారణంగా బాలానగర్ వాసులు గజగజ వణుకుతున్నారు. నవంబర్ లోనే ఈ పరిస్థితి ఉండగా, డిసెంబర్ లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్