జడ్చర్ల: మైసమ్మ దేవాలయంకు భక్తుల తాకిడి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్ వద్ద కొలువైన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్