మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఎన్నికల అధికారులు, పోలీసులు జాతీయ రహదారి-44 పై వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్ఐ లెనిన్ మాట్లాడుతూ, వాహనాల్లో మద్యం బాటిళ్లు, రూ. 50 వేలకు మించి నగదు తరలించరాదని, అలా తరలిస్తే అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.