జడ్చర్ల: ఫ్రీ బస్సు ఫుల్... ఆటో డ్రైవర్ల ఆవేదన

జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం రాణిపేట్ లో శుక్రవారం ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. ఫ్రీ బస్సు వల్ల ప్రయాణికులు తగ్గి నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రూ. 400 సంపాదన కూడా రావడం లేదన్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్