జడ్చర్ల: భారీ వర్షం.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి 44వ జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వీస్ రోడ్డులో రెండు వాహనాలు చెడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడినప్పటికీ, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్