జడ్చర్ల: అర్ధరాత్రి వేళ... అక్రమంగా మట్టి తరలింపు.!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిధిలోని కేఎస్ఐ (కల్వకుర్తి ఎత్తిపోతల పథకం) కాలువ సమీపంలో నిల్వ ఉన్న మట్టిని కొందరు కేటుగాళ్లు శుక్రవారం అర్ధరాత్రి వేళ యథేచ్ఛగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టిప్పర్ల ద్వారా ఈ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, అధికారులు నిద్రపోతున్న వేళ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, కెనాల్ పక్కన ఉన్న డంప్ మట్టి మాయమవుతోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్