జడ్చర్ల: కేసీఆర్ కు, మా అందరికి ఇష్టమైన నాయకులులక్ష్మారెడ్డి

మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ తో పాటు అందరికీ ఇష్టమైన నాయకులు డా. సి. లక్ష్మారెడ్డి అని పేర్కొన్నారు. సర్పంచ్ పదవికే రాజీనామా చేయాలంటే ఆలోచిస్తారని, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారని తెలిపారు. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా, ప్రలోభాలకు లొంగకుండా మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గెలుపు కోసం పని చేశారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పట్ల లక్ష్మారెడ్డి నిబద్ధత, నిజాయితీకి మారుపేరు అని హరీష్ రావు కొనియాడారు.

సంబంధిత పోస్ట్