జడ్చర్ల: రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి: లక్ష్మారెడ్డి

గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయని, కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లలోకి వచ్చి పోలీసుల గల్లా పట్టే స్థాయికి చేరారని మాజీ మంత్రి, మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి శుక్రవారం ఆరోపించారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తూ, కాపాడాల్సిన వారికే రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గాలిలో దీపంలా మారిందని, పోలీసులపై కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనలో పోలీసులకు తాము అండగా ఉంటామని లక్ష్మారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్