జడ్చర్ల: ఆటోను ఢీ కొట్టిన లారీ.. పలువురికి గాయాలు

మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులో లారీ ఆటోను ఢీకొట్టడంతో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మాదారం నుంచి మిడ్జిల్ వస్తున్న లారీ, మిడ్జిల్ నుండి మల్లాపురం వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య, వడ్డే గంగమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్