శనివారం జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాలానగర్ మండలంలోని మోతీఘణపూర్ గ్రామ శివారులో బిహార్ కు చెందిన రాజేందర్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 420 గ్రాముల ఎండు గంజాయి, 10 గ్రాముల గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బిహార్ లో కిలో రూ. 5 వేలకు కొనుగోలు చేసి, 5 గ్రాములకు రూ. 400, 1 చాక్లెట్ రూ. 50 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.