జడ్చర్ల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై దుస్తులు లేవని, చేతిపై "ఎల్లమ్మ" అనే పేరుతో పచ్చబొట్టు ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 58597 నంబర్ ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్