జడ్చర్ల: చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్ (43) తన మోటార్ సైకిల్ ను అతివేగంగా నడిపి చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. శనివారం నవాబుపేట నుండి తిరుగు ప్రయాణంలో లోకిరేవు, గోవోనిపల్లి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు భార్య సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్