జడ్చర్ల: నాగసాల చెరువులో వ్యక్తి గల్లంతు

శుక్రవారం, జడ్చర్ల పట్టణంలోని నాగసాల చెరువులో ఇనుము కోసం నీటిలోకి దిగిన రమేశ్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. తిమ్మాజిపేట మండలం మామిడిచెట్టు తండాకు చెందిన రమేశ్, గణేశ్ నిమజ్జనం సమయంలో పడిన ఇనుమును తీయడానికి చెరువులోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, SDRF బృందాలు చెరువులో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్