జడ్చర్ల: పాడె మోసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన పుట్టినరోజున కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుడు బాలరాజ్ యాదవ్ పాడె మోసి తుది వీడ్కోలు పలికారు. బాలరాజ్ యాదవ్ మరణంతో సంతాప సూచకంగా ఎమ్మెల్యే తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. మూడుసార్లు ఎంపీటీసీగా గెలుపొందిన బాలరాజ్ యాదవ్ మరణంతో ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తనకు పుట్టినరోజు వేడుకల కంటే పార్టీ నేతలు, కార్యకర్తలే ముఖ్యమని అనిరుధ్ రెడ్డి చాటారు.

సంబంధిత పోస్ట్