జడ్చర్ల: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గుండేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేస్తామని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్