జడ్చర్ల: ఒంటరిగా పాత బజార్లో పర్యటించిన ఎమ్మెల్యే

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత బజార్, కాలనీలలో ఆకస్మికంగా పర్యటించారు. గన్మెన్లు, నాయకులు, పోలీసులు లేకుండానే మార్నింగ్ వాక్లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి అక్కడికక్కడే సూచనలు, సలహాలు చేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటనతో కాలనీ వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్