మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్ లో ఈ నెల 6న అనారోగ్యంతో స్పృహతప్పి పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని 108 అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని, అక్కడ చికిత్స ఫలించక మృతి చెందాడని శనివారం ఎస్ఐ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు మహబూబ్ నగర్ రైల్వే ఎస్ఐ మొబైల్ నంబర్ 8712658597కు ఫోన్ చేసి తెలపాలని కోరారు.